Aishwarya Rai: ఈ ఫొటో చూసిన తర్వాత కూడా అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని చెప్పగలరా?

Aishwarya Rai wishes her husband Abhishek Bachchan with a beautiful message on his birthday
  • అభిషేక్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ విడిపోతున్నారంటూ కొన్నాళ్లుగా పుకార్లు
  • నేడు అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు
  • సాయంత్రం వరకు విషెస్ చెప్పని ఐశ్వర్యరాయ్
  • ఆలస్యం అయినా... ఇన్ స్టాగ్రామ్ పోస్టుతో అందరిని సంతోషపెట్టిన ఐశ్వర్య
బాలీవుడ్ సెల్రెబిటీ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య కలతలు వచ్చాయని, విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లకు ఐశ్వర్యరాయ్ ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు. 

ఇవాళ అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు. దాంతో ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కానీ సాయంత్రం వరకు ఐశ్వర్య నుంచి ఎలాంటి శుభాకాంక్షల ప్రకటన రాకపోవడంతో, ఊహాగానాలే నిజమన్న అభిప్రాయం కలిగింది. 

అయితే, సాయంత్రం వేళ ఐశ్వర్యరాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు అందరి సందేహాలను పటాపంచలు చేసింది. ఎమోజీలతో ఒక అందమైన పుట్టినరోజు సందేశాన్ని ఐశ్వర్య పోస్టు చేసింది. 

"నువ్వు సంతోషకరమైన పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరింత ఆనందం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆయురోగ్యాలు, దేవుడి దీవెనలు నీకు లభించాలని ఆశిస్తున్నాను. ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండాలి" అంటూ భర్తను ఉద్దేశించి పేర్కొంది. 

ఐశ్వర్య పెట్టిన పోస్టుతో బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు సంతోష సాగరంలో తేలియాడుతున్నారని వేరే చెప్పాలా? సోషల్ మీడియాలో వారి కామెంట్లే అందుకు నిదర్శనం.
Aishwarya Rai
Abhishek Bachchan
Birthday
Wishes
Bollywood

More Telugu News