Chandrababu: ముగిసిన చంద్రబాబు, పవన్ సమావేశం... వివరాలు ఇవిగో!

Meeting between Chandrababu and Pawan Kalyan concluded
  • ఈ మధ్యాహ్నం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్
  • దాదాపు 3 గంటల పాటు సమావేశం
  • టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు, పవన్
  • సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం!
  • పలు స్థానాల్లో ఆశావహులకు నచ్చజెప్పుకోవాలని టీడీపీ, జనసేన నిర్ణయం
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల మధ్య సమావేశం ముగిసింది. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు, పవన్ స్పష్టతకు వచ్చారు. సీట్ల పంపకాలపై ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. 

జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు పార్టీ అధిష్ఠానం నచ్చజెప్పనుంది. ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ అధిష్ఠానం స్పష్టమైన హామీ ఇవ్వనుంది. 

అదే సమయంలో... టీడీపీ పోటీ చేసే స్థానాల్లో తమ పార్టీ ఆశావహులకు జనసేన పార్టీ నచ్చజెప్పుకోనుంది. టీడీపీ తరహాలోనే తమ పార్టీ ఆశావహులకు కూడా రాజకీయ భవిష్యత్తుపై జనసేన హైకమాండ్ భరోసా ఇవ్వనుంది. 

ఇరుపార్టీల్లోని ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాతే అభ్యర్థుల జాబితాలు ప్రకటించాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకున్నారు.
Chandrababu
Pawan Kalyan
TDP
Janasena
Alliance
Andhra Pradesh

More Telugu News