నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్
- ఫైల్స్ మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని తేల్చి చెప్పిన కేంద్ర దర్యాప్తు సంస్థ
- సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ నిందితులని వెల్లడి
- ఛార్జిషీట్‌లో వివరాలు పేర్కొన్న సీబీఐ అధికారులు
సీబీఐ తాజాగా మంత్రి కాకాణికి దోషులతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఇక ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. ఏడాది పాటు విచారణ జరిపిన సీబీఐ అధికారులు 88 మంది సాక్షులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన 403 పేజీల చార్జ్‌షీట్ రూపొందించింది. కాగా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆయన మొదటి నుంచి చెబుతూ వచ్చారు. సీబీఐ విచారణకైనా తాను సిద్ధమంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.