Italy Ambassador: గోవాలో ఇటలీ రాయబారి భార్య తలకు గాయం..రిసార్టు ఓనర్‌పై కేసు

Goa FIR against resort owner after Italian ambassadors wife injured in fireworks
  • నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉత్తర గోవాలో ఘటన
  • రిసార్టు వద్ద టపాసులు పేల్చేందుకు అనుమతించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన రిసార్టు యజమాని
  • టపాసులు తగలడంతో ఇటలీ రాయబారి భార్య తలకు గాయం
  • గౌరవ వైస్ కాన్సుల్ ఆఫ్ ఇటలీ ఫిర్యాదుతో ఓనర్‌పై కేసు నమోదు

గోవాలో టపాసుల పేలుడు కారణంగా ఇటలీ రాయబారి భార్యకు గాయాలవడంతో బాధ్యుడైన రిసార్ట్ ఓనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనవరి 1న ఈ ఘటన జరిగింది. ఉత్తర గోవాలోని అశ్వెమ్ బీచ్‌లోని ఓ రిసార్ట్‌ ఓనర్ టపాసులు పేల్చేందుకు అనుమతించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇటలీ రాయబారి విన్సెజో డీ లూకా భార్య పావొలా ఫెర్రీ తలకు టపాసులు తగిలి గాయమైంది. 

ఈ నేపథ్యంలో గౌరవ వైస్ కాన్సుల్ ఆఫ్ ఇటలీ శ్రీనివాస్ డెంపో ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 2న పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 338 కింద కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నాక తదుపరి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News