LK Advani: అద్వానీకి భారతరత్న రావడంపై కూతురు ప్రతిభా అద్వానీ స్పందన

Daughter hugs her father after govt decision to confer him Bharat Ratna
  • తన తండ్రికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్న ప్రతిభా అద్వానీ
  • అద్వానీ తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారని వ్యాఖ్య
  • తండ్రికి మిఠాయి తినిపించిన కూతురు

కేంద్ర ప్రభుత్వం తనకు భారతరత్న ప్రకటించిన తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తొలిసారి బయటకు వచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభా అద్వానీ మాట్లాడుతూ... తన తండ్రికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం లభించడం కుటుంబానికి ఆనందంగా ఉందన్నారు. అద్వానీ తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారన్నారు. అద్వానీకి ఈ పురస్కారం అందిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న రావడంపై తన తండ్రి కూడా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. 

అద్వానీకి భారతరత్న ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత, తన కుమార్తె ప్రతిభా అద్వానీతో కలిసి ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభా అద్వానీ తన తండ్రికి మిఠాయి తినిపించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయంతో సంతోషంగా ఉన్న ప్రతిభా అద్వానీ తండ్రిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News