మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి ఊడ్చిన మంత్రి సీతక్క
- మేడారంలో పర్యటించిన మంత్రి సీతక్క
- జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి
- మేడారం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని సూచన
ఉదయం కొండాయి గ్రామానికి చేరుకున్న సీతక్క గోవిందరాజుల ఆలయం, నాగులమ్మ దేవాలయాన్ని పరిశీలించారు. ఆలయాల అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయం వద్ద పరిశీలించారు. పూజారులు, అధికారులతో కలిసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. జంపన్నవాగు వద్దకు కూడా వెళ్లారు. మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వచ్ఛ మేడారం కార్యక్రమంలో పాల్గొన్నారు.