భారత్ లో 69 లక్షలకు పైగా సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ నిషేధం
- భారత్ లో వాట్సాప్ కు 50 కోట్ల యూజర్లు
- డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదులు
- కేంద్ర ప్రభుత్వ ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఖాతాలపై వాట్సాప్ చర్యలు
2023 డిసెంబరు 1 నుంచి 31వ తేదీ మధ్య 69,34,000 ఖాతాలపై వాట్సాప్ తొలుత ఆంక్షలు విధించింది. వాటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, నేరుగా నిషేధం విధించింది. డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదులు అందాయి.
అంతకుముందు, నవంబరులోనూ భారత్ లో 71 లక్షల సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ వేటు వేసింది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు చెందిన వాట్సాప్ కు భారత్ లో 50 కోట్ల యూజర్లు ఉన్నారు.