Visakhapatnam: విశాఖపట్టణం జిల్లాలో తహసీల్దార్ దారుణ హత్య

Visakha dist Chinagadili MRO Killed
  • చినగదిలి రూరల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రమణయ్య
  • కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్‌మెంట్ వద్దే దారుణం
  • ఇనుప రాడ్డుతో తలపై మోది పరారైన దుండగులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

విశాఖపట్టణం జిల్లాలో ఓ తహసీల్దార్ నిన్న దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని చినగదిలి రూరల్ తహసీల్దార్‌ సనపల రమణయ్యను ఆయన నివాసం వద్దే దుండగులు హత్య చేశారు. కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై దాడిచేశారు.

తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, భూ సమస్యల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News