విజయవాడలోని సాయిబాబా మందిరానికి లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకుడు

Beggar Gave One Lakh Donation To Mutyalapadu Saibaba Temple
  • ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం అందించిన యాదిరెడ్డి
  • ఆలయం వద్దే భిక్షాటన
  • ఇకపైనా ప్రతీ రూపాయి దైవకార్యానికే వెచ్చిస్తానని వెల్లడి
విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరానికి ఓ యాచకుడు లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు. ఆలయం వద్ద బిచ్చమెత్తుకుని జీవించే యాదిరెడ్డి మందిర అభివృద్ధికి తనవంతు సాయంలో భాగంగా ఈ విరాళం ఇచ్చారు. మందిరం గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి నిన్న ఆ సొమ్ము అందించారు.

ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ సంపాదించే సొమ్మును తిరిగి స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపైనా ప్రతీ రూపాయి దైవ కార్యానికే అందిస్తానని ఈ సందర్భంగా యాదిరెడ్డి తెలిపారు. తన జీవితం బాబా సేవకే అంకితమన్న ఆయన ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం ఇవ్వడం గమనార్హం.
Go Back to Shorts
Vijayawada
Mutyalapadu Saibab Temple
Beggar
Donation

More Telugu News