Yashasvi Jaiswal: విశాఖ టెస్టులో యశస్వి జైస్వాల్ సెంచరీ

Yashasvi Jaiswal smashes his second ton in tests
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా యువ కిశోరం యశస్వి జైస్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. విశాఖలో ఇంగ్లండ్ తో రెండో టెస్టులో తొలి రోజు లంచ్ అనంతరం సెషన్ లోనే జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా దిగారు. జైస్వాల్ 151 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ కు ఇది రెండో సెంచరీ. జైస్వాల్ ఓ సిక్స్ తో సెంచరీ పూర్తి చేసుకోవడం హైలైట్ గా నిలిచింది. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 58 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు. సెంచరీ హీరో జైస్వాల్ 119 పరుగులతోనూ, కొత్త బ్యాట్స్ మన్ రజత్ పాటిదార్ 13 పరుగులతోనూ ఆడుతున్నారు. జైస్వాల్ స్కోరులో 13 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 14, శుభ్ మాన్ గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27 పరుగులు చేశారు. 

ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ 1, టామ్ హార్ట్ లే 1, షోయబ్ బషీర్ 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Yashasvi Jaiswal
Century
Team India
England
2nd Test

More Telugu News