Upasana: తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన ఉపాసన

Upasana met Telangana governor Tamilisai in Hyderabad
  • హైదరాబాదులో రాజ్ భవన్ కు వెళ్లిన ఉపాసన
  • గవర్నర్ తమిళిసైకి జ్ఞాపిక బహూకరణ
  • గిరిజనుల అభివృద్ధి కోసం గవర్నర్ పాటుపడుతున్నారంటూ అభినందనలు

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు వెళ్లిన ఉపాసన... గవర్నర్ కు ఓ జ్ఞాపికను బహూకరించారు. గిరిజనుల సంక్షేమం కోసం ఆమె పాటుపడుతున్న తీరు గురించి లోతుగా అర్థం చేసుకున్నాక, ఆమె కృషి తన హృదయాన్ని తాకిందని ఉపాసన పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం మీ చర్యలు అమోఘం... అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మేడమ్ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News