Vijay: విజయ్ హీరోగా డీవీవీ దానయ్య సినిమా?

Vijay in DVV Danayya Movie
  • తెలుగులోను విజయ్ కి మంచి మార్కెట్ 
  • నేరుగా 'వారసుడు' మూవీ చేసిన హీరో 
  • షూటింగు దశలో ఆయన 68వ సినిమా
  • డీవీవీ దానయ్యకి ఇచ్చిన గ్రీన్ సిగ్నల్

విజయ్ కి తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక తెలుగులోను ఆయన సినిమాల మార్కెట్ పెరిగింది. ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువకావడం కోసం ఆయన నేరుగా 'వారసుడు' సినిమా చేసి, తెలుగుతో పాటు తమిళంలో విడుదలయ్యేలా చూశాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఆయన 68వ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.

ఈ నేపథ్యంలోనే విజయ్ మరో తెలుగు సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు .. 'ఆర్ ఆర్ ఆర్' వంటి పాన్ ఇండియా సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య. ఆయన ఓ స్టార్ డైరెక్టర్ తో విజయ్ ను కలుసుకుని కథను వినిపించడం ... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. 

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నారని వినికిడి. అయితే మరో వైపున రాజకీయాల దిశగా విజయ్ వేస్తున్న అడుగుల కారణంగా, ఆయన తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొంత సందిగ్ధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళుతుందనేది చూడాలి.

Vijay
Actor
DVV Danayya

More Telugu News