Telangana: తెలంగాణలో రేపటి నుంచి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

Appointment of special officers for gram panchayatis
  • తెలంగాణలో నేటితో ముగిసిన సర్పంచ్‌ల పదవీకాలం
  • ప్రత్యేక అధికారులను నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ
  • తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 సెక్షన్ 136 (3) కింద స్పెషల్ ఆఫీసర్ల నియామకం
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు. తెలంగాణలో గ్రామ సర్పంచ్‌ల పదవీ కాలం నేటితో ముగుస్తోంది. దీంతో ప్రత్యేక అధికారులను నియమించడమా? లేక సర్పంచ్‌ల పదవీ కాలాన్ని పొడిగించడమా? లేక తక్షణమే ఎన్నికలు నిర్వహించడమా? అనే చర్చ సాగింది.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 సెక్షన్ 136 (3) కింద స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు జీవో జారీ అయింది. దీంతో రేపటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.
Telangana
Gram Panchayat Elections
sarpanch

More Telugu News