Nara Lokesh: కుటుంబంతో కలిసి శ్రీశైలానికి వెళ్లిన నారా లోకేశ్.. ఫోటోలు ఇవిగో

Nara Lokesh in Srisailam along with family
  • సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద లోకేశ్ కు టీడీపీ, జనసేన నేతల స్వాగతం
  • సాక్షి గణపతి స్వామిని దర్శించుకున్న లోకేశ్
  • కాసేపట్లో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న లోకేశ్

టీడీపీ యువనేత నారా లోకేశ్ శ్రీశైలం చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీశైలంకు వచ్చారు. కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేతలు ఎన్ఎండీ ఫరూక్, రాజశేఖర్ రెడ్డి, పలువురు టీడీపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సున్నిపెంట నుంచి ఆయన శ్రీశైలంకు రోడ్డు మార్గంలో బయల్దేరారు. మార్గమధ్యంలో ఉన్న సాక్షి గణపతి స్వామిని ఆయన దర్శించుకున్నారు. కాసేపట్లో ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 


  • Loading...

More Telugu News