Nirmala Sitharaman: నేడు మధ్యంతర బడ్జెట్టును ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్.. అరుదైన ఘనత సొంతం!

Union Finance Minister Nirmla Sitharam To Create Record With Todays Interim Budget
  • ఇప్పటి వరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
  • నేడు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ ఆరోది
  • ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కొత్త ప్రభుత్వం
  • తాజా బడ్జెట్‌లో మహిళలు, రైతులను ఆకర్షించే ప్రకటనలు ఉండే అవకాశం

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకోబోతున్నారు. పార్లమెంటులో ఆమె నేడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థికమంత్రిగా నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఆరోసారి. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు. మొరార్జీ దేశాయ్ 1959-64 మధ్య ఆర్థికమంత్రిగా వరుసగా ఐదుసార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే, గతంలో మన్మోహన్‌సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మల నేడు ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ ఆరోది. 

ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో రైతులు, మహిళలను ఆకట్టుకునే ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.

  • Loading...

More Telugu News