KCR: ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం.. ఆ వెంటనే ప్రతిపక్ష నేతగా బాధ్యతల స్వీకరణ

BRS chief KCR to take oath today as MLA
  • కామారెడ్డిలో ఓడి గజ్వేల్‌లో గెలిచిన బీఆర్ఎస్ అధినేత
  • ఫాంహౌస్‌లో జారిపడడంతో తుంటికి గాయం
  • ఆపరేషన్ తర్వాత కోలుకున్న కేసీఆర్
  • నేడు మధ్యాహ్నం 12.45 గంటలకు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం
బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాదవశాత్తు ఫాంహౌస్‌‌లో జారిపడిన కేసీఆర్‌‌కు తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో ప్రమాణ స్వీకారానికి దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో నేటి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారని, 12.45 గంటలకు స్పీకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించినప్పటికీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో 5,156 ఓట్ల తేడాతో కేసీఆర్ ఓటమి పాలయ్యారు.
KCR
BRS
Telangana

More Telugu News