Kumari Aunty: నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే వేశా: 'కుమారి ఆంటీ'

Hyderabad Kumari Aunty says she costed her vote to Chandrababu
  • మీరు అభిమానించే పార్టీ ఏది? అని అడిగిన యూట్యూబ్ ప్రతినిధి
  • తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే వేశానని సమాధానం
  • నెట్టింట వైరల్‌గా మారిన కుమారి ఆంటీ వీడియో
తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చంద్రబాబు గారికే ఓటు వేశానని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మీకు ఇల్లు ఇచ్చి, మేలు చేశారని ఓ ఇంటర్వ్యూలో మీరు చెప్పారని, దీంతో ఇది వైరల్ అయిందని.. కానీ అసలు మీరు అభిమానించే పార్టీ ఏది? అని ఓ యూట్యూబ్ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కుమారి ఆంటీ స్పందిస్తూ... తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే వేశానని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎక్స్ సామాజిక వేదికపై ట్రెండింగ్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుమారి ఆంటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని... జగన్ వచ్చాక వచ్చిన ఇల్లు మాత్రమే ఊళ్లో ఉందని చెప్పారు. తనకు ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరగడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు. అయితే జగన్ తనకు ఇల్లు ఇచ్చిన అంశంపై నెట్టింట వైరల్‌గా మారింది. ఇదే సమయంలో మీరు అభిమానించే పార్టీ ఏది? అని మరో యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి అడిగితే తాను ఎప్పుడూ చంద్రబాబుకే ఓటు వేశానని చెప్పారు.
Kumari Aunty
Hyderabad
Chandrababu
Telugudesam
Telangana

More Telugu News