విప్రోలో లేఆఫ్స్.. వందల మందిని సాగనంపేందుకు ప్లాన్!
- మిడ్ లెవెల్ ఉద్యోగులను తొలగించనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు
- లాభాలా మార్జిన్ల పెంపునకు ప్రయత్నిస్తున్న విప్రో
- తొలగింపులపై మౌనం వహించిన కంపెనీ ప్రతినిధి
అయితే, తొలగింపుల పర్వాన్ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘ఈ నెల మొదట్లోనే ఉద్యోగులకు ఈ మేరకు సమాచారం అందింది. ఆన్సైట్లో ఉన్న వందల మంది మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఉద్యోగులను సాగనంపనున్నారు. వీళ్లల్లో చాలా మంది భారీ జీతాలు తీసుకుంటున్నారు’’ అని పేర్కొన్నాయి. కాగా, లాభాల మార్జిన్లు మెరుగుపరిచే బాధ్యతను సీఎఫ్ఓ అపర్నా అయ్యర్‌కు సంస్థ అప్పగించింది. ఈ వార్తలపై స్పందించిన సంస్త ప్రతినిధి ఒకరు తొలగింపులపై ఎటువంటి విస్పష్ట ప్రకటన చేయలేదు. అయితే, సంస్థ వ్యాపారాలు, వనరులను మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా సిద్ధం చేయాలని వ్యాఖ్యానించారు.
తొలగింపుల్లో భాగంగా సంస్థ లెఫ్ట్ షిఫ్ట్ పద్ధతిని అనుసరించబోతున్నట్టు తెలిసింది. ‘‘లెవెల్ 3 ఉద్యోగి బాధ్యతలు లెవెల్ 2 ఉద్యోగికి వెళతాయి. లెవెల్ 2 బాధ్యతలు లెవెల్ 1కు మారతాయి. ఇక లెవెల్ 1 బాధ్యతలను ఆటోమేట్ చేయాలి. ఇవి అన్ని కంపెనీలు చేస్తున్నాయి’’ అని విశ్వనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి.