Puri Jagannadh: మోసపోవడం వల్లనే పూరి జగన్నాథ్ ఐదారు మేడలు అమ్మేశాడు: తల్లి అమ్మాజీ

Ammaji Interview
  • పూరి గురించి చెప్పిన తల్లి 
  • అతనికి జాలిగుణం ఎక్కువని వెల్లడి 
  • సాయానికి ముందుంటాడని వ్యాఖ్య 
  • నమ్మిన వ్యక్తి అతనిని మోసం చేశాడని ఆవేదన

పూరి జగన్నాథ్ గురించి ఆయన తల్లి అమ్మాజీ 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మా అబ్బాయి పూరి జగన్నాథ్ కి మొదటి నుంచి కూడా జాలి గుణం ఎక్కువ. ఎదుటివారికి సాయం చేసే స్వభావం చిన్నప్పటి నుంచి ఉంది. ఒక కుర్రాడు బావిలో పడిపోతే, అతణ్ణి కాపాడటం కోసం చిన్నప్పుడే బావిలోకి దూకేశాడు" అన్నారు. 

"పూరి దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు .. అతను పూరి సంపాదించిన కోట్ల రూపాయలను కొట్టేశాడు. అంతేకాకుండా పూరి పేరు చెప్పి బయట అప్పులు చేశాడు. ఆ  డబ్బుతో పూరి పేరుమీదే స్థలాలు కొనుగోలు చేస్తున్నట్టుగా చెప్పాడు. అతనిపై గల నమ్మకంతో చూసుకోకుండానే పూరి కాగితాలపై సంతకం చేశాడు. అలా ఆ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలకు పూరిని మోసం చేశాడు. దాంతో ఆ అప్పులు తీర్చడానికి మా అబ్బాయి ఐదారు మేడలు అమ్ముకోవలసి వచ్చింది" అని చెప్పారు. 

"అలా పూరి ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు అందరం ఏడ్చాము. మళ్లీ మాకు ధైర్యం చెప్పింది కూడా పూరినే. మా బంధువులు ఆ వ్యక్తి సంగతి చూస్తామని అంటే కూడా వారించాడు. తనకి ఇంకా సంపాదించే శక్తి ఉందని మమ్మల్ని ఓదార్చాడు. ఇంతా చేసిన ఆ వ్యక్తి ఏమైనా బాగుపడ్డాడా అంటే అదీ లేదు. సినిమాలు తీసి అదంతా పోగొట్టుకున్నాడు" అన్నారు.
Puri Jagannadh
Director
Ammaji

More Telugu News