Kodandaram: నా ఎమ్మెల్సీ పదవిపై వివాదం సరికాదు: కోదండరాం విజ్ఞప్తి

Kodandaram about his mlc issue
  • రాజ్యాంగంలో షరతులు అర్థమైతే తన ఎమ్మెల్సీ పదవిపై చర్చ ఉండదని వ్యాఖ్య
  • జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదన్న కోదండరాం
  • రాజ్యాంగపరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారని వెల్లడి
  • తాను సుదీర్ఘ కాలం సేవ చేసినందువల్ల వివాదం వద్దని విజ్ఞప్తి

తాను సుదీర్ఘ కాలం సేవలు చేశానని.. కాబట్టి తన ఎమ్మెల్సీ పదవిపై వివాదం సరికాదని తెలంగాణ జన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటా కింద కోదండరాంను ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన వారిని ఆమోదించకుండా... కాంగ్రెస్ నామినేట్ చేసిన వారికి గవర్నర్ ఆమోదం తెలపడంపై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోదండరాం స్పందించారు.

రాజ్యాంగంలో షరతులు అర్థమైతే తన ఎమ్మెల్సీ పదవిపై చర్చ ఉండదని సూచించారు. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదన్నారు. రాజ్యాంగపరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారన్నారు. తాను సుదీర్ఘ కాలం సేవ చేసినందువల్ల వివాదం వద్దని కోరారు. ప్రజలకు అన్నీ తెలుసునని... వారే అన్ని అంశాలను అంచనా వేసుకుంటారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News