Praja Bhavan: ‘ప్రజాభవన్‌’ దగ్గర కారు బీభత్సం కేసులో పోలీసుల అదుపులోకి బోధన్‌ సీఐ ప్రేమ్‌ కుమార్‌

Bodhan CI Prem Kumar has been arrested by the police in the case of car theft near Praja Bhavan
  • బోధన్‌లో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలింపు
  • పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావుతో ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడిన కాల్‌ రికార్డును ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • డిసెంబర్ 23న ప్రజాభవన్ దగ్గర కారుతో బారికేడ్లను బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్
హైదరాబాద్‌‌ బేగంపేటలోని ప్రజాభవన్‌ దగ్గర కారుతో బీభత్సం కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ ప్రమేయం ఉన్న ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, షకీల్‌ అనుచరుడు అబ్దుల్‌ వాసేను అదుపులోకి తీసుకొచ్చారు. బోధన్‌లో అదుపులోకి తీసుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్‌ తరలించారు. పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావుతో బోధన్‌ సీఐ ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడిన కాల్‌ రికార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా డిసెంబర్  23న అర్ధరాత్రి తర్వాత సాహిల్‌ అతివేగంతో కారు నడిపాడు. ప్రజాభవన్‌ ముందు ఉన్న ట్రాఫిక్‌ బారికేడ్లను కారుతో ఢీకొట్టాడు. అయితే తన డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాహిల్ స్థానంలో డ్రైవర్‌ను పెట్టి దుబాయ్‌ పరారైన విషయం తెలిసిందే. అయితే సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి.
Praja Bhavan
Bodhan CI
CI Prem Kumar
Hyderabad
Telangana

More Telugu News