Kesineni Nani: చంద్రబాబుపై 3 లక్షల మెజారిటీతో గెలుస్తా: కేశినేని నాని

Kesineni Nani confident of winning in elections if contested against cbn
  • నందిగామ వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేశినేని 
  • చంద్రబాబు విజయవాడ నుంచి పోటీ చేసినా గెలవరని వ్యాఖ్య
  • ఎన్నికల్లో ఓడిపోయిన లోకేశ్ స్థాయి ఎంతని ప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బాబు విజయవాడ నుంచి పోటీ చేసినా గెలవరు అని చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు. నందిగామ వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీలోంచి మెడపట్టుకుని బయటకు గెంటేశారని అన్నారు. తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినన్న కేశినేని నాని..ఎన్నికల్లో ఓడిపోయిన లోకేశ్ స్థాయి ఎంత అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News