Jyothika: సూర్యతో విడాకులు అంటూ వస్తున్న వార్తలపై జ్యోతిక స్పందన!

Jyothika on divorce news with husband Suriya
  • సూర్య కుటుంబంలో కలహాలు అంటూ వార్తలు
  • ఇప్పటికే ముంబైకి షిఫ్ట్ అయిన సూర్య, జ్యోతిక
  • తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జ్యోతిక
సినీ రంగంలో విడాకుల సంస్కృతి పెరిగిపోతోంది. డైవోర్స్ అనేది ఒక సాధారణ అంశంగా మారిపోయింది. ఎంత ఈజీగా ఒకటవుతున్నారో... అంతే ఈజీగా విడిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో సెలెబ్రిటీ జంటలు విడాకులు తీసుకున్నాయి. తాజాగా కోలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ సూర్య, జ్యోతిక గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వీరు ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చి ముంబైకు మకాం మార్చారు. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఎక్కువయింది.

 ఈ నేపథ్యంలో జ్యోతిక స్పందించారు. తనకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆమె అన్నారు. పిల్లల చదువు, తాను బాలీవుడ్ సినిమాలకు కమిట్ కావడం, తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవడం తదితర కారణాల వల్లే ముంబైకి మారామని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు తమ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని తెలిపారు. తన భర్త సూర్య చాలా సిన్సియర్ వ్యక్తి అని కితాబునిచ్చారు. పిల్లల చదువు పూర్తి కాగానే చెన్నైకి తిరిగొస్తామని చెప్పారు. జ్యోతిక వివరణతోనైనా విడాకుల ప్రచారానికి తెర పడుతుందేమో వేచి చూడాలి.
Jyothika
Suriya
Kollywood
Divorce

More Telugu News