KTR: సుమతీ శతక పద్యంతో కేటీఆర్ సంచలన పోస్ట్!

KTR Sensational Tweet on CM Revanth Reddy
  • కనకపు సింహాసనమున..పద్యాన్ని షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • పెద్దలు ఎప్పుడో చెప్పారంటూ కామెంట్, తన పోస్టులో ఎవరి పేరునూ ప్రస్తావించని వైనం
  • రేవంత్‌ను ఉద్దేశించే కేటీఆర్ ఈ పోస్ట్ పెట్టారంటూ నెట్టింట ప్రచారం
‘కనకపు సింహాసనమున..’అంటూ సుమతీశతక పద్య ప్రస్తావనతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. పెద్దలు ఎప్పుడో చెప్పారంటూ పద్యానికి ఆయన చేసిన కామెంట్ వైరల్‌ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేశారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే, కేటీఆర్ తన పోస్ట్‌లో ఎవరి పేరునూ ప్రస్తావించకపోవడం గమనార్హం. 

కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిన్న నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 'ఆట మొదలైంది కాస్కో' అంటూ కేసీఆర్‌ను ఈ సందర్భంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను సరిహద్దుల నుంచి తరిమేద్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
KTR
Revanth Reddy
Congress
BRS

More Telugu News