Janasena party symbol: జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ

EC allots Glass symbol to Janasena
  • మరోసారి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ  
  • ఈ-మెయిల్ ద్వారా జనసేనకు సమాచారం 
  • ఉత్తర్వుల ప్రతులను పవన్‌కు అందజేసిన పార్టీ లీగల్ సెల్ చైర్మన్
జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా మరోసారి గాజు గ్లాసును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఈ మేరకు పార్టీకి ఈ-మెయిల్ చేసింది. ఈసీ ఉత్తర్వుల ప్రతులను జనసేన లీగల్ సెల్ చైర్మన్ ఇ.సాంబశివ ప్రతాప్ మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన పవన్.. ఈసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. 

గత సార్వత్రిక ఎన్నికలతో పాటూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నేతలు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన విషయం తెలిసిందే.
Janasena party symbol
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News