ICC T20 Team 2023: 2023 అత్యుత్తమ టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు దక్కని చోటు

Rohit Sharma and Virat Kohli not in ICC T20 team
  • జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్
  • జట్టులో స్థానం దక్కించుకున్న నలుగురు భారత ఆటగాళ్లు
  • కీపర్ గా విండీస్ కు చెందిన నికోలస్ పూరన్

2023 ఏడాదికి గాను అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కలేదు. అయితే జట్టు కెప్టెన్ గా టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ తో పాటు మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ లకు జట్టులో స్థానం కల్పించింది. ఐసీసీ టీ20 జట్టులో వరుసగా రెండో ఏడాది సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. 

జట్టులో ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్ సాల్డ్, న్యూజిలాండ్ కు చెందిన మార్క్ చాప్ మన్, జింబాబ్వేకు చెందిన సికందర్ రాజా, ఉగాండా ఆల్ రౌండర్ అల్పేశ్ రంజానీ, వికెట్ కీపర్ గా వెస్టిండీస్ కు చెందిన నికోలస్ పూరన్, ఐర్లండ్ కు చెందిన మార్క్ అడైర్, జింబాబ్వేకు చెందిన రిచర్డ్ నగర్వాను ఎంపిక చేసింది.

  • Loading...

More Telugu News