అయోధ్య నుంచి ఆహ్వానం అందింది... వచ్చేస్తున్నా: స్వామి నిత్యానంద
- మరోసారి తెరపైకి వివాదాస్పద గురు
- అయోధ్యలో చారిత్రక ఘట్టం జరుగుతోందని వెల్లడి
- అందరూ హాజరు కావాలని పిలుపు
- గతంలో అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద
అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన స్వామి నిత్యానంద... కరీబియన్ దీవులకు సమీపంలో ఓ దీవిలో మకాం ఏర్పరచుకుని, దాన్నే కైలాస దేశంగా ప్రకటించుకున్నారు. తన కైలాస దేశానికి ఐరాస గుర్తింపు కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, తన దేశానికి సొంత కరెన్సీ, సొంత రిజర్వ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు.