Pawan Kalyan: కొణతాల రామకృష్ణ జనసేన లోకి రావడం శుభ పరిణామం: పవన్ కల్యాణ్

Pawan Kalyan welcomes Konathala Ramakrishna into Janasena Party
  • జనసేన పార్టీలో చేరుతున్నానంటూ కొణతాల రామకృష్ణ ప్రకటన
  • కొణతాలను సాదరంగా స్వాగతిస్తున్నామన్న పవన్ కల్యాణ్
  • ఆయన సేవలు పార్టీకి ఉపయోగకరం అని వెల్లడి 
సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం శుభ పరిణామం అని అభివర్ణించారు. కొణతాలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. 

కొణతాల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత ఉన్న నాయకుడు అని వివరించారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల రామకృష్ణ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు.
Pawan Kalyan
Konathala Ramakrishna
Janasena
Andhra Pradesh

More Telugu News