Konathala Ramakrishna: జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించిన కొణతాల రామకృష్ణ

Konathala Ramakrishna announces that he will join Janasena party
  • 2014 నుంచి వైసీపీకి దూరంగా కొణతాల రామకృష్ణ
  • ఇటీవల హైదరాబాదులో పవన్ కల్యాణ్ తో సమావేశం
  • నేడు అనకాపల్లిలో తనవారితో సమావేశం
  • జనసేనతో కలిసి నడవాలనుకుంటున్నట్టు వెల్లడి

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుడైన కొణతాల రామకృష్ణ... 2014 నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నిరోజుల కిందటే హైదరాబాదు వెళ్లి జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. జనవరి 21న అనకాపల్లిలో తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, తదితరులతో చర్చించి తాను ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని వెల్లడించారు. 

చెప్పినట్టుగానే కొణతాల ఇవాళ తనవారితో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను జనసేన పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, పవన్ కల్యాణ్ ఈ దిశగా రాజీలేని పోరాటం చేస్తాడని తాను నమ్ముతున్నానని తెలిపారు. పవన్ కు ఏపీ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News