రామ సేతు తీరంలో ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో!
- ధనుష్కోడిలోని అరిచల్ మునై పాయింట్ సందర్శన
- అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకల నేపథ్యంలో ప్రధాని తీర్థయాత్రలు
- దక్షిణ భారత దేశంలోని పుణ్య క్షేత్రాలలో మోదీ పూజలు
అంతకుముందు ప్రధాని మోదీ శనివారం శ్రీరంగంలోని రంగనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆపై రామేశ్వరం వెళ్లిన ప్రధాని అక్కడి ఆలయంలోని పవిత్ర తీర్థాల్లో పుణ్య స్నానం ఆచరించారు. ప్రతీ తీర్థం దగ్గర ప్రధాని పుణ్య స్నానం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడే సాగర స్నానం చేసిన మోదీ.. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్పే రామేశ్వర లింగానికి పూజలు చేశారు.