Telangana: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామక ఉత్తర్వులు జారీ

Telangana Government Advisors Appointment Orders Issued by govt
  • సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడిగా వేం నరేందర్ రెడ్డి నియామకం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుడిగా షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవికి ఛాన్స్
  • నియామక ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది. నలుగురు సలహాదారులకు అవకాశం కల్పించింది. సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుడిగా షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిలకు అవకాశం కల్పించారు. హర్కార వేణుగోపాల్ రావుని ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జారీ చేశారు.
Telangana
Telangana Government
Government Advisors
Vem Narender Reddy
Shabbir Ali

More Telugu News