Ch Malla Reddy: దుబాయ్ లో డెజర్ట్ బైక్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి విన్యాసాలు

Malla Reddy riding in desert bike in Dubai sands
  • మేడ్చల్ మున్సిపల్ నేతలతో కలిసి దుబాయ్ వెళ్లిన మల్లారెడ్డి
  • దుబాయ్ లో హాయిగా ఎంజాయ్ చేస్తున్న వైనం
  • ఇటీవల గోవా బీచ్ లోనూ మల్లారెడ్డి విన్యాసాలు

తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్ లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్ ఎడారిలో డెజర్ట్ బైక్ ను నడుపుతూ ఉల్లాసంగా కనిపించారు. కొన్నిరోజుల క్రితమే మేడ్చల్ మున్సిపల్ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిన మల్లారెడ్డి రాజకీయాలను కాసేపు పక్కనపెట్టారు. అక్కడి సందర్శనీయ స్థలాల్లో విహరిస్తున్నారు. అరబ్బుల తరహాలో తలపాగా చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెల్ల దుస్తులు ధరించి డెజర్ట్ బైక్ ను నడిపి ముచ్చట తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల మల్లారెడ్డి గోవా బీచ్ లోనూ సందడి చేశారు. గోవా బీచ్ లో ఆయన పారా గ్లైడింగ్ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News