Chandrababu: కడప గడ్డపై అడుగుతున్నా... సమాధానం చెప్పే దమ్ముందా జగన్?: చంద్రబాబు

Chandrababu challenges CM Jagan from Kadapa soil
  • కమలాపురం సభలో చంద్రబాబు వ్యాఖ్యలు
  • జగన్ ఒక్క చాన్స్ అని ఎన్నో కథలు చెప్పాడని విమర్శలు
  • వివేకాను ఘోరంగా చంపేశారని ఆరోపణలు 
  • నాపై కథనం రాశాడీ దుర్మార్గుడు అంటూ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

"గత ఎన్నికల సమయంలో ఒక్క చాన్స్ అన్నాడు, ఎన్నో కథలు చెప్పాడు... చివరికి బాబాయ్ హత్య జరిగింది. హూ కిల్డ్ బాబాయ్?... తమ్ముళ్లూ ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు! సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తుంది. 

2019 మార్చి 19న వివేకాను ఘోరంగా చంపేశారు. ఆ రోజు  సొంత డబ్బా సాక్షి చానల్ లో గుండెపోటుతో చనిపోయారని వచ్చింది. రక్తం కనిపించిన తర్వాత మాట మార్చేసి రక్తపు వాంతులు అన్నారు. పోస్టుమార్టం కూడా వీళ్లు వద్దనుకున్నారు. 

దీంట్లో ఏదో మోసం ఉందని ఆయన కూతురు పోస్టుమార్టం కోసం పట్టుబట్టింది. దాంతో పోస్టుమార్టం చేయగా, అతి కిరాతకంగా తలపై గొడ్డలితో నరికారన్న విషయం బయటపడింది. ఇష్టంవచ్చినట్టు గొడ్డలితో వేట్లు వేయడంతో మెదడు కూడా బయటికి వచ్చి చెల్లాచెదురైపోయింది! అప్పుడు మళ్లీ మాట మార్చేశారు. నాకు నాన్న లేడు, ఈరోజు బాబాయ్ ని కూడా చంపేశారు... దిక్కులేని బిడ్డను అయిపోయాను అంటూ జగన్ మోహన్ రెడ్డి కొత్తనాటకం ఆడాడు. 

కడప గడ్డ మీద నుంచి అడుగుతున్నా... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ మోహన్ రెడ్డికి ఉందా? ఆ తర్వాత సాక్షి పేపర్ లో నారాసుర రక్తచరిత్ర అని కత్తి నా చేతిలో పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు" అంటూ నిప్పులు చెరిగారు. 

వీళ్లు ఇసుక నుంచి కూడా తైలం తీస్తారు!

వైసీపీ నేతలు పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. వీళ్లు ఎలాంటివాళ్లు అంటే ఇసుక నుంచి కూడా తైలం తీస్తారు. పులివెందులలో ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారు. కుందూ నదిలో ఇసుక స్వాహా చేస్తున్నారు. 

కమలాపురం ఎమ్మెల్యే పెద్ద అవినీతి చక్రవర్తి

కమలాపురం ఎమ్మెల్యే (సీఎం జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్ రెడ్డి) ఒక పెద్ద అవినీతి చక్రవర్తి. రూ.20 వేల కోట్ల విలువైన 9 ఎకరాలకు టెండర్ పెట్టారు. సర్వారాయ ప్రాజెక్టు వద్ద 400 ఎకరాలు ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. బద్వేలులో మొత్తం భూబకాసురులే. టీడీపీ వచ్చాక తిన్నదంతా కక్కిస్తాం... వడ్డీతో సహా వసూలు చేస్తాం.

కడప ఎమ్మెల్యే ఒక ఉత్సవ విగ్రహం

కడప ఎమ్మెల్యే (డిప్యూటీ సీఎం అంజాద్ బాషా) అసలున్నాడా, లేడా? అనే అనుమానం వస్తోంది. కడప ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహంలా మారారు. కడప జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యేదీ ఒక్కొక్క తీరు. అన్ని చోట్లా ఎమ్మెల్యేలను మార్చుతున్నారు కానీ, కడప జిల్లా ఎమ్మెల్యేలను మాత్రం ఇంకా బదిలీ చేయలేదు.
Chandrababu
Jagan
Kamalapuram
Raa Kadali Raa
TDP
YSRCP

More Telugu News