Balashowry: పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ఎంపీ వల్లభనేని బాలశౌరి

MP Balashowry meets Pawan Kalyan
  • 2019లో వైసీపీ తరపున ఎంపీగా గెలుపొందిన బాలశౌరి
  • ఇటీవల వైసీపీకి రాజీనామా
  • జనసేనలో చేరుతానని ఆరోజే ప్రకటించిన బాలశౌరి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి ఆయన వెళ్లారు. 2019లో వైసీపీ తరపున బాలశౌరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రోజే తాను జనసేనలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేశ్ లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. మరోవైపు, జనసేనలో చేరిక, ఇతర రాజకీయ అంశాలపై పవన్ తో బాలశౌరి చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News