Kodikathi Sreenu: నిరాహారదీక్షకు దిగిన కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు

Kodikathi Sreenu mother and brother hunger strike
  • ఐదేళ్లుగా జైల్లోనే ఉన్న కోడికత్తి శ్రీను
  • జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని శ్రీను తల్లి, సోదరుడి డిమాండ్
  • లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని విన్నపం

గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో శ్రీను జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన విశాఖ జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిరాహారదీక్షకు దిగారు. దీక్షకు పోలీసుల అనుమతులు లేకపోవడంతో విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా శ్రీను తల్లి సావిత్రి మాట్లాడుతూ... తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేపడతామని చెప్పారు. ఈ కేసులో కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని అన్నారు. తమకు ప్రజా సంఘాలు మద్దతును ఇవ్వాలని కోరారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు కూర్చోనున్నాడు.

  • Loading...

More Telugu News