Boppana Bhava Kumar: నారా లోకేశ్ ను కలిసిన విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్

Boppana Bhava Kumar met Nara Lokesh
  • త్వరలో ఏపీలో ఎన్నికలు
  • రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
  • టీడీపీలో చేరనున్న బొప్పన భవకుమార్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా,  విజయవాడ వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిశారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన లోకేశ్ తో భేటీ అయ్యారు. భవకుమార్ వెంట కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ కూడా ఉన్నారు. 

భవకుమార్ నేడు నారా లోకేశ్ ను కలవకముందే వంగవీటి రాధా, కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ లతో చర్చించారు. భవకుమార్ గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమిపాలయ్యారు. భవకుమార్ త్వరలోనే తన అనుచర గణంతో టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
Boppana Bhava Kumar
Nara Lokesh
TDP
YSRCP
Vijayawada

More Telugu News