K Kavitha: తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడించిన కవిత

My social media account experienced a brief unauthorized access
  • మంగళవారం రాత్రి పది గంటల నుంచి పలుమార్లు హ్యాక్ అయినట్లు వెల్లడి
  • అనుమానాస్పద కంటెంట్ వస్తే తాను పోస్ట్ చేసినట్లుగా భావించవద్దని విజ్ఞప్తి
  • డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయినట్లు తెలిపారు. ఈ సమయంలో అనుమానాస్పద కంటెంట్ వుంటే కనుక తాను పోస్ట్ చేసినట్లుగా భావించవద్దని కోరారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి పది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పలుమార్లు హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు.

ఇన్‌స్టాలో సంబంధం లేని వీడియోను సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేసినట్లు తెలిపారు. దీనిని వెంటనే గుర్తించి... డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశానన్నారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తన కార్యాలయ సిబ్బంది హ్యాకింగ్ జరిగినట్లుగా త్వరితగతిన గుర్తించిందని.. ఇందుకు వారిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
K Kavitha
BRS
Telangana

More Telugu News