Congress: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. అద్దంకి దయాకర్ కు షాక్

TS Congress MLC Candidates
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్
  • రేపటితో ముగుస్తున్న నామినేషన్ల గడువు
  • ఈనెల 29న పోలింగ్
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కు పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు మొండి చేయి చూపించింది. తమ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ల పేర్లను ప్రకటించింది. 

ఎమ్మెల్సీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరు ఖరారయిందనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని నిన్న దయాకర్ కు పార్టీ పెద్దలు ఫోన్ చేసి చెప్పారట. దీంతో, ఆయన అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఒక్క రోజులోనే సీన్ మారిపోయింది. దయాకర్ స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ ప్రకటించింది. 

ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తోంది. 29వ తేదీన పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి, రిజల్ట్స్ ను ప్రకటిస్తారు.
Congress
MLC
Addanki Dayakar
Mahesh Kumar Goud

More Telugu News