ప్రజాభవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్... మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కేసు
- గత ఏడాది కారు వేగంగా నడుపుతూ ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన షకీల్ తనయుడు రహీల్
- దుబాయ్ పారిపోయిన రహీల్‌కు లుకౌట్ నోటీసుల జారీ
- కేసు నుంచి కొడుకును తప్పించేందుకు షకీల్ ప్రయత్నించినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు
షకీల్ కుమారుడు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు పదిమంది సహాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో అర్బాజ్, సాహిల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు... వారిని రిమాండ్‌కు తరలించారు. రహీల్‌కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌లో ఉన్న అతనిని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇప్పటికే దుబాయ్‌లో ఉన్నారు.