Crime News: కుమార్తె పేరున రూ. 6 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్.. ఇచ్చేందుకు నిరాకరించడంతో భార్యతో కలిసి హత్యచేసిన తండ్రి

Daughter Refuses To Break Fixed Deposit killed
షార్ట్స్‌లో చూడండి
తన పేరున ఉన్న రూ. 6 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఇచ్చేందుకు నిరాకరించిన కుమార్తెను పెంపుడు తల్లితో కలిసి కన్నతండ్రే దారుణంగా హత్యచేశాడు. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. 

పోలీసుల కథనం ప్రకారం బాధిత బాలిక ఖుషి కుమారి (17)  ఈ నెల 13న తన గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఉరికి వేలాడుతున్న సోదరిని చూసిన ఆమె సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ. 6 లక్షలు ఇవ్వనందుకు తన తండ్రి, సవతి తల్లి కలిసి ఆమెను చంపేశారని ఆరోపించాడు. ఫిక్స్‌డ్ చేసిన ఆ సొమ్ము త్వరలోనే మెచ్యూర్ అవాల్సి ఉందని పేర్కొన్నాడు.

విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్థులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Crime News
Jharkhand
Stepmom
Fixed Deposit
Ramgarh District

More Telugu News