Guruvayar Temple: ప్రధాని మోదీ సమక్షంలో ఒక్కటైన కేరళ జంట.. వీడియో ఇదిగో!

PM hands garlands to couple stars witness the union in Kerala
  • కేరళ నటుడి కుమార్తె వివాహానికి హాజరైన ప్రధాని
  • స్వయంగా దండలు అందించి ఆశీర్వాదం
  • బుధవారం గురువాయర్ టెంపుల్ సందర్శన
కేరళలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ప్రఖ్యాత గురువాయర్ టెంపుల్ ను సందర్శించారు. శ్రీకృష్ణుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో జరిగిన కేరళ నటుడు సురేశ్ గోపి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. స్వయంగా పూల దండలు అందించి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖులలో మమ్ముట్టి, మోహన్ లాల్, దిలీప్, జయరామ్, ఖుష్బూ, డైరెక్టర్ షాజీ కైలాశ్ తదితరులు ఉన్నారు.

అదే సమయంలో గురువాయర్ ఆలయంలో ఒక్కటైన మరో 30 జంటలను కూడా ప్రధాని మోదీ ఆశీర్వదించారు. ప్రధాని మోదీ వస్తున్నారని తెలిసి గురువాయర్ టెంపుల్ కు జనం పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. స్వామి వారిని దర్శించుకున్న మోదీ.. నూతన వధూవరులను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Guruvayar Temple
Modi visit
Marriage
Garland
kerala Actors

More Telugu News