Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

Telangana CM Revanth Reddy sankranthi greetings to people
  • భోగి, సంక్రాంతి, కనుమను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్ష
  • సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలన్న రేవంత్ రెడ్డి
  • రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలన్నారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు. ఇదిలావుంచితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. విద్యుత్ సరఫరా, బొగ్గు కేటాయింపు, పౌరసరఫరాల బకాయిలు, హైదరాబాద్-నాగపూర్ కారిడార్‌కు అనుమతులు తదితర అంశాలపై చర్చించారు.
Revanth Reddy
Congress
Sankranti
Makar Sankranti

More Telugu News