Bus Accident: అనంతపురం జిల్లాలో బస్సును ఢీ కొట్టిన లారీ.. బస్సు డ్రైవర్ మృతి

One dead and 13 injured in a lorry and bus collision in Anantapur
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. బస్సులోని ప్రయాణికుల్లో 13 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని వెల్దుర్తి మండలం ఉల్లడికొండ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను బయటకు తీసి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Bus Accident
Ananthapur
Driver Dead
Passengers Hurt
Bus lorry collision
Andhra Pradesh
Road Accident

More Telugu News