Weight Loss: ఆహారం ఫుల్లుగా తిన్నా బరువు పెరగకూడదనుకుంటే ఈ 5 డ్రింక్స్ తాగితే చాలు !

These 5 drinks helps in control gain weight even after eating heavy food
  • ‘నిమ్మరసంతో వెచ్చని నీరు’ జీర్ణక్రియకు చక్కగా పనిచేస్తుందంటున్న వైద్య నిపుణులు
  • ‘అల్లం టీ’తో కడుపు ఉబ్బరానికి చెక్ పడుతుందని సూచన
  • జీర్ణక్రియకు 5 ముఖ్యమైన పానీయాలను సూచిస్తున్న వైద్యులు
పరిమితికి మించి ఆహారం తీసుకుంటే బరువు పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తినేవారు త్వరగా బరువు పెరిగిపోతుంటారు. పండగ సీజన్ వేళ ఇలాంటి ఫుడ్‌ని తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులు లేదా బంధువులు ఒకేచోట చేరి వేడుకలు నిర్వహించుకోవడమే ఇందుకు కారణంగా ఉంది. ఇలాంటి సందర్భాల్లోనే అధిక కేలరీస్ ఉండే ఆహారాన్ని మితిమీరి తిని, బరువు పెరిగే సూచనలు ఉన్న నేపథ్యంలో వైద్య నిపుణులు కొన్ని విలువైన సూచనలు చేస్తున్నారు. జీర్ణక్రియకు సహాయపడి కడుపుబ్బరాన్ని తగ్గించేందుకు దోహదపడే 5 ముఖ్యమైన పానీయాలను సూచిస్తున్నారు. భోజనం ఎక్కువగా తిన్న తర్వాత ఈ పానీయాలు తాగితే చక్కటి ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు. వైద్య నిపుణులు సూచిస్తున్న ఆ 5 విలువైన డింక్స్ ఏవో మీరూ ఓ లుక్కేయండి.. 

అల్లం టీ: జీర్ణక్రియ ప్రక్రియలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం టీలోని వేడి లక్షణాలు కడుపులో గడబిడని, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అధికంగా భోజనం చేయడం వల్ల కలిగిన ఇబ్బందులను నివారిస్తుంది. టీ తియ్యగా ఉండడం కోసం తేనె లేదా దాల్చిన చెక్కను వేసుకోవచ్చు.

నిమ్మరసంతో వెచ్చని నీరు: బరువు తగ్గాలనుకునేవారు ‘నిమ్మరసంతో వెచ్చని నీరు’ తీసుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయలో ఆమ్లత్వం ఆహారం అరుగుదలకు చక్కగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఇక వెచ్చటి నీళ్లు జీర్ణవ్యవస్థ నాళాన్ని సడలిస్తాయని చెబుతున్నారు. నిమ్మరసంతో వెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ బాగా జరగడంతోపాటు వ్యక్తులు హైడ్రేటెడ్‌గా ఉండేలా సహాయ పడుతుంది.

సోంపు గింజల టీ: సోంపు గింజలను జీర్ణ చికిత్సలో విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ గింజల్లో ఉండే ‘అనెథోల్‌’ సమ్మేళనం కండరాలకు ఉపశమనం ఇచ్చి నొప్పులను తగ్గిస్తాయి. కడుపుబ్బరం, అజీర్తికి సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే సోంపు గింజలతో టీ చేసుకొని తాగితే బాగా పనిచేస్తుంది. వేడి నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను వేసుకొని ఆ పానీయం తాగితే చక్కగా పనిచేస్తుంది. రుచి కూడా బావుంటుంది. 

పిప్పరమెంట్ టీ: జీర్ణ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన వాటిల్లో పిప్పరమెంట్ ఒకటి. దీనిలోని చలువ చేసే లక్షణాలు కడుపుబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మెంథాల్ శాతం అధికంగా ఉండడంతో కడుపు కండరాలను కూడా సడలిస్తుంది. డిన్నర్ తర్వాత వెచ్చని నీటిలో పిప్పరమెంట్ కలుపుకొని తాగితే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

యాపిల్ సైడర్ వెనిగర్ టానిక్:
రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచడానికి యాపిల్ సైడర్ వెనిగర్ టానిక్ చక్కగా పనిచేస్తుంది. భోజనానికి ముందు లేదా తర్వాత ఈ పానీయాన్ని తీసుకుంటే ఆకలిని నియంత్రించడంతోపాటు అతిగా తినకుండా నిరోధిస్తుంది. అరుగుదలకు చక్కగా పనిచేస్తుంది.
Weight Loss
Lemon Water
Health tips
Helth tips
digestive drinks

More Telugu News