Guntur Kaaram: గుంటూరు చేరుకున్న 'గుంటూరు కారం' టీమ్

Guntur Kaaram team arrives Guntur for pre release event
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో 'గుంటూరు కారం'
  • సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్
  • నేడు గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తరలివచ్చిన చిత్రబృందం
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి బరిలో ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుక నేడు గుంటూరులో జరగనుంది. 

వాస్తవానికి జనవరి 6న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉన్నా, భద్రత అంశాలకు సంబంధించిన అనుమతులు లభించలేదు. దాంతో, చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 9న గుంటూరులో నిర్వహించాలని నిర్ణయించింది. ఇక్కడి నంబూరు క్రాస్ రోడ్స్ సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కనే ఉన్న 20 ఎకరాల స్థలంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. 

కాగా, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు 'గుంటూరు కారం' టీమ్ గుంటూరు చేరుకుంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీలీల, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, తమన్, ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తరలివచ్చారు. కాసేపట్లో 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Guntur Kaaram
Pre Release Event
Guntur
Mahesh Babu
Trivikram Srinivas
Thaman
S Radha Krishna
Dil Raju
Sreeleela
Meenakshi Chowdary
Tollywood

More Telugu News