Team India: టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు!

New sponsors for Indian cricket
  • ఇప్పటివరకు టీమిండియాకు స్పాన్సర్ గా కొనసాగిన డ్రీమ్ 11
  • ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ నుంచి కొత్త స్పాన్సర్లు
  • కొత్త స్పాన్సర్లుగా కాంపా, ఆటంబర్గ్ సంస్థల పేర్లు ప్రకటించిన బీసీసీఐ
  • కాంపా... రిలయన్స్ గ్రూప్ నకు చెందిన సంస్థ
  • ఆటంబర్గ్... ఓ గృహోపకరణాల సంస్థ
టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు. కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. 2024-26 సీజన్లలో భారత దేశవాళీ క్రికెట్ తో పాటు, టీమిండియాకు కూడా ఈ రెండు సంస్థలు స్పాన్సర్లుగా కొనసాగుతాయని బీసీసీఐ వివరించింది. 

ఇప్పటివరకు టీమిండియాకు డ్రీమ్ 11 సంస్థ స్పాన్సర్ గా వ్యవహరించింది. జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు కొత్త స్పాన్సర్ల లోగోలతో ఉన్న దుస్తులు, కిట్లు ఉపయోగించనున్నారు. కాంపా సంస్థ రిలయన్స్ గ్రూప్ నకు చెందిన శీతలపానీయాల సంస్థ. ఇక, ఆటంబర్గ్ కూడా భారత్ కే చెందిన గృహోపకరణాల సంస్థ.
Team India
Sponsor
Campa
Atomberg
BCCI
India

More Telugu News