guntur karam: 'గుంటూరు కారం' బెనిఫిట్ షోలకు ఓకే: మహేశ్ బాబు అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

Telangana Government permission to guntur karam movies benefit show
  • ఈ నెల 12 నుంచి 23 చోట్ల అర్ధరాత్రి ఒంటిగంట షోలకు పచ్చజెండా
  • 12 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 4 గంటలకు ప్రదర్శన
  • టిక్కెట్ ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు తీపి కబురు! గుంటూరు కారం సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట నుంచి... 23 చోట్ల షోలకు పచ్చజెండా ఊపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 4 గంటల షోలను ప్రదర్శిస్తారు. థియేటర్‌లలో ఈ సినిమా ఆరో షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

అలాగే సినిమా టిక్కెట్ ధర పెంపునకు కూడా ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.65, మల్టీప్లెక్స్ థియేటర్‌లలో రూ.100 పెంపునకు అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. బెనిఫిట్ షోలు కేవలం మొదటి వారానికి మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. మహేశ్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News