Ponguleti Srinivas Reddy: 40 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు: మంత్రి పొంగులేటి

Minister Ponguleti talks about Abhaya Hastam guarantees
  • ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్
  • అభయహస్తం పేరిట అర్హుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
  • గ్యారెంటీలను ఇప్పటికిప్పుడు అమలు చేయలేమన్న పొంగులేటి
  • 100 రోజుల్లో అమలు చేస్తామని వెల్లడి

అభయహస్తం హామీలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... అభయహస్తం కోసం ఇప్పటివరకు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వాటిలో భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డుల కోసం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 

గ్యారెంటీలను ఇప్పటికిప్పుడే అమలు చేయాలని నిలదీయడం సరికాదని పొంగులేటి అభిప్రాయపడ్డారు. 40 రోజుల్లోనే అమలు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News