Kesineni Swetha: బరువెక్కిన హృదయంతో చెబుతున్నా... టీడీపీతో నా ప్రస్థానం ముగిసింది: కేశినేని శ్వేత

Kesineni Swetha announces her journey with TDP comes to an end
  • విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
  • ఇప్పటికే టీడీపీకి దూరం జరిగిన కేశినేని నాని
  • తండ్రి బాటలోనే కుమార్తె... కార్పొరేటర్ పదవికి రాజీనామా
  • కేశినేని భవన్ ద్వారా ప్రజాసేవను కొనసాగిస్తానని వెల్లడి
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి దూరం కాగా, కుమార్తె కేశినేని శ్వేత కూడా తండ్రి బాటలోనే నడిచారు. విజయవాడలో కార్పొరేటర్ పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగభరితంగా స్పందించారు.

"బరువెక్కిన హృదయంతో చెబుతున్నా... టీడీపీతో నా ప్రస్థానం ముగిసింది. ఇప్పటివరకు నాకు మార్గదర్శనం చేసిన చంద్రబాబు సర్ కు, నారా లోకేశ్ అన్నకు కృతజ్ఞతలు. విజయవాడ ప్రజల ప్రేమాభిమానాలకు, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కేశినేని భవన్ ద్వారా ప్రజాసేవను కొనసాగిస్తాను" అంటూ శ్వేత ట్వీట్ చేశారు.
Kesineni Swetha
TDP
Corporator
Vijayawada
Kesineni Nani

More Telugu News