అభయ హస్తం దరఖాస్తుదారులకు పోలీసుల అలర్ట్
- సైబర్ నేరస్థులు ఫోన్లు చేసే అవకాశం ఉందని హెచ్చరిక
- పథకం మంజూరైందని చెబుతూ ఓటీపీ అడిగితే చెప్పొద్దని సూచన
- ఓటీపీ షేర్ చేస్తే అకౌంట్ లోని సొమ్మును కాజేస్తారంటున్న పోలీసులు
ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకోసం ఈ అప్లికేషన్లు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజుల పాటు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రస్తుతం సైబర్ నేరస్థులు కన్నేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి, బ్యాంకు ఖాతాలోని సొమ్మును కాజేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.